'రెడ్ మి నోట్ 7 ప్రో'లో కొత్త వేరియంట్

'రెడ్ మి నోట్ 7 ప్రో'లో కొత్త వేరియంట్

రెడ్ మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు శక్తివంతమైన వేరియంట్ అందుబాటులోకి రానుంది. టి వరకు ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు 6జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఇండియాలలో బుధవారం(ఏప్రిల్ 10) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. 

ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6.3 అంగుళాల స్క్రీన్, 48 ఎంపీ+5 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 4 జీబీ ర్యామ్+64 జీబీ మెమరీ వేరింయట్ ధర రూ.13,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్+128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.16,999గా ఉండనుంది.