వాల్నట్స్ తో హైబీపీ తగ్గుతుంది!!

వాల్నట్స్ తో హైబీపీ తగ్గుతుంది!!

వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలా కాలంగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్ ను కూడా తగ్గిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. లో శాచురేటెడ్ ఫ్యాట్స్ (తక్కువ సంతృప్త కొవ్వులు) ఉన్న ఆహారంతో పాటు వాల్నట్స్ తీసుకొంటే రక్తపోటు తగ్గిస్తాయని స్పష్టమైంది. ముఖ్యంగా కార్డియోవాస్కులర్ వ్యాధి (గుండెజబ్బు) ఉన్నవారికి వాల్నట్స్ ఎంతో మేలు చేస్తాయి. వాల్నట్స్ లో రక్తపోటుపై సానుకూల ప్రభావం చూపే వృక్ష ఆధారిత ఒమెగా-3.. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్(ఏఎల్ఏ) ఉంటుంది. 

తమ అధ్యయనంలో పరిశోధకులు కొన్ని శాచురేటెడ్ ఫ్యాట్స్ ఆహారపదార్థాలకు బదులు వాల్నట్స్ ఇచ్చారు. రోజూ సంతృప్త కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారంతో పాటు హోల్ వాల్నట్స్ తీసుకొన్నవారిలో సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ తగ్గినట్టు వారు గుర్తించారు. సెంట్రల్ ప్రెషర్ అంటే గుండె వంటి భాగాలు ఉపయోగించుకొనే ఒత్తిడి అని పరిశోధకులు చెప్పారు. సంప్రదాయికంగా బ్లడ్ ప్రెషర్ ను చేతి దగ్గర కొలిచినట్టు ఇది ఒక వ్యక్తి గుండెజబ్బు (సీవీడీ) ప్రమాదాన్ని ఎదుర్కోనున్నారా అనే సమాచారాన్ని తెలియజేస్తుంది.