మందుబాబులకు మరో షాక్.. బార్ల సంఖ్య తగ్గించాలని సీఎం ఆదేశం..

మందుబాబులకు మరో షాక్.. బార్ల సంఖ్య తగ్గించాలని సీఎం ఆదేశం..

మద్యం నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. జనవరి 1 నుంచి కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇబ్బందులేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సూచించిన ఏపీ సీఎం.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం అమ్మాలని ఆదేశించారు. ఇందుకోసం విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. ఆదాయశాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.