గోదావరికి తగ్గిన వరద నీరు

గోదావరికి తగ్గిన వరద నీరు

పవిత్ర గోదావరి నది భద్రాచలం వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో నది నీటిమట్టం దాదాపు 30 అడుగులకు చేరింది. అయితే నిన్నటి నుంచి మహారాష్ట్ర, ఎగువ ఉన్న ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతో నదిలోకి వరద నీరు క్రమంగా తగ్గిపోయింది. బుధవారం ఉదయం భద్రచాలం వద్ద 30.6 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 29.7 అడుగులుగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.