రెజీనా బయపెడుతుందంటున్న నెటిజన్లు ..!!

రెజీనా బయపెడుతుందంటున్న నెటిజన్లు ..!!

చెన్నై నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రెజీనా.  రెజీనా తన అభినయంతో పాటు డ్యాన్స్ లోను అదరగొట్టింది.  మెగా హీరోలతో వరసగా సినిమాలు చేసిన రెజీనా ఒక సమయంలో మెగా హీరోయిన్ అనిపించుకుంది.  గ్లామర్ షోకి వెనుకాడని రెజినా నక్షత్రం మిస్టర్ చంద్రమౌళి సినిమాలలో విపరీతంగా అందాలను ఆరబోసింది. ఈ మధ్యే కెరీర్ లో ఊపు తగ్గిన రెజినా రీసెంట్ గా చిరంజీవి 'ఆచార్య' సినిమా ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. 

తాజాగా సోషల్ మీడియాలో రెజీనా ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. ఈమె మేకోవర్ చూసి వామ్మో అనుకుంటున్నారు. అసలు ఈమె రెజీనానా కాదా అనిపించే విధంగా మారిపోయింది.  కొత్త మేకోవర్ కు సంబంధించిన ఫోటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  అవి చుసిన అభిమానులు రెజీనా బయపెడుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు ఇలా ఎందుకు మారింది. ఫోటో షూట్ కోసమా లేక మెగాస్టార్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఇలా కనిపిస్తుందా అని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.