రెజినాకు నిశ్చితార్థం అయిందా ?

రెజినాకు నిశ్చితార్థం అయిందా ?

సినీ పరిశ్రమలో పుకార్లకు, హాట్ హాట్ వార్తలకు కొదవే ఉండదు.  ఎప్పుడూ ఏదో ఒక వార్త హడావుడి చేస్తూనే ఉంటుంది.  ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి రోజూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది సోషల్ మీడియాలో.  తాజాగా నటి రెజినాకు నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది వివాహమనే న్యూస్ బాగా వైరల్ అయింది.  కొన్ని పాపులర్ న్యూస్ పోర్టల్స్ కూడా వార్తను కవర్ చేయడంతో అంతా నిజమేనని నమ్మేశారు.  తీరా చూస్తే ఆ వార్తల్లో నిజం లేదని ఆమె సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.  రెజినా ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.