వద్దన్నా... రెజీనా ఆ పని చేసిందట..!!

వద్దన్నా... రెజీనా ఆ పని చేసిందట..!!

శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది రెజీనా. ఈ సినిమా పర్వాలేదనిపించింది.  దీని తరువాత తెలుగులో వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.  తన నటనతో ఆకట్టుకున్న రెజీనా.. ఎక్కువ సినిమాలు మెగా కాంపౌండ్ హీరోలతో చేయడంతో మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నది.  

తెలుగులో వరసగా సినిమాలు చేసిన ఈ హీరోయిన్ కు ఇటీవల కాలంలో అవకాశాలు తగ్గిపోయాయి.  అటు తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తున్నది రెజీనా.  అయితే, బాలీవుడ్ లో సోనమ్ కపూర్ తో కలిసి ఏక్ లడ్కికో దేఖాతో ఐసా లాగా సినిమాలో చేసింది.  ఇందులో లెబ్సియన్ మహిళగా నటించింది.  ఈ కథ విన్నాక చాలా రోజులు ఆలోచించిందట రెజీనా.  తన ఫ్రెండ్స్ అందరూ ఈ సినిమా చెయ్యొద్దని చెప్పారట.  అందరు వద్దు అంటున్నారు కాబట్టి చాలెంజింగ్ గా తీసుకొని చేయాలని పట్టుబట్టింది.  అనుకున్నట్టుగానే సినిమా చేసింది.  రెజీనాకు ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది.  ఈ సినిమా తరువాత ఆమెకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు వస్తాయని అనుకున్నా.. మరో అఫర్ రాకపోవడం విశేషం.