తలైవి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

తలైవి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

వివాదాల తార కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి సినిమాను చేస్తోంది. ఈ సినిమాలో కంగనా లీడ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్న రోజులుగా ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారా అని చర్చలు జరుగుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందిన తలైవీ రిలీజ్ డేట్‌ను ఎట్టకేలకు ఫిక్స్ చేశారు. సినిమా చిత్రీకరణకు చాలా సమయం తీసుకున్న టీం విడుదలకు మాత్రం హడావిడీ చేస్తున్నారు. ఈ సినిమాను వాస్తవానికి గతేడాది విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. అయితే ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని వారు యోచిస్తున్నారు. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామీ నటించాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.