మోడీ బయోపిక్ పై నిషేదం సబబే

మోడీ బయోపిక్ పై నిషేదం సబబే

ప్రధాని మోడీ బయోపిక్ ను ఎన్నికలు పూర్తయ్యే దాకా నిషేదించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమర్ధించింది. సుప్రీంకోర్టుకు సీల్డు కవర్ లో సమర్పించిన నివేదికలో ఈసీ ఈ విషయం స్పష్టం చేసింది. 'ఈ బయోపిక్ లో మోడీని ఆకాశానికి ఎత్తుతూ చిత్రీకరించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని అవినీతి పార్టీగా, హీనంగా ఇందులో చూపించారు. ఏకపక్షంగా తీసిన ఈ చిత్రం విడుదలకు అంగీకరిస్తే బీజేపీ రాజకీయంగా ఎంతో లబ్ధి పొందుతుంది' అని ఈసీ అభిప్రాయపడింది.