జియో ఫైబర్‌లో ఎన్నో ప్రత్యేకతలు..

జియో ఫైబర్‌లో ఎన్నో ప్రత్యేకతలు..

జియోతో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ.. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి జియో ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ముంబైలో జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు సంస్థ ఛైర్మన్ ముకేష్ అంబానీ. వచ్చే నెల 5వ తేదీ నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు అవుతుందని.. దాంతో అదే రోజున జియో ఫైబర్‌ సేవలను కమర్షియల్‌ బేసిస్‌లో ప్రారంభించనున్నట్టు.. దేశంలోని 1600 నగరాల్లో 2 కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార సంస్థలకు చెందిన భవనాలకు జియో ఫైబర్‌ను అందించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు వెల్లడించారు. 

జియో ఫైబర్‌ ప్రత్యేకతలు:
* జియో ఫైబర్‌ ద్వారా 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వరకు డేటా పొందవచ్చు.
* జియో ఫైబర్‌ సేవలు నెలకు కనీస ధర రూ. 700 ఉండగా.. అత్యధికంగా రూ. 10 వేల వరకు ఉంటాయి.. ఎంపికను బట్టి మారుతుంటాయి. 
* ప్రీమియం జియో ఫైబర్‌ కస్టమర్లు ఇక థియేటర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా.. సినిమా విడుదలైన రోజే ఇంట్లోనే సినిమా చూసుకునే వీలు. అయితే, ‘జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’గా పిలిచే ఈ సేవలను వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నాయి.
* జియో ఫైబర్‌ ద్వారా దేశంలోని ఇతర ఏ టెలికాం ఆపరేటర్‌కైనా ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే వీలు.
* ఫరెవర్ వార్షిక ప్లాన్‌ తీసుకునే జియో ఫైబర్‌ వినియోగదారులకు హెచ్‌డీ/ 4కే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్‌ బాక్సును ఉచితంగా తీసుకునే వీలు. 
* దేశంలోని ఏ నెట్‌వర్క్ అయినా ఉచిత కాలింగ్‌తో పాటు నెలకు రూ. 500తో అమెరికా, కెనడాకు అపరిమిత కాలింగ్‌ ప్యాకేజీ.