రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ జియో ఒప్పందం రద్దు

రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ జియో ఒప్పందం రద్దు

కొన్ని పేర్కొన్న టెలికామ్ ఆస్తుల అమ్మకంపై అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్ కామ్), ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోల మధ్య కుదిరిన ఒప్పందం రద్దయింది. పరస్పర అంగీకారం మేరకు ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ఆర్ కామ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. రిలయన్స్ జియోతో ఆస్తుల విక్రయ ఒప్పందాన్ని పూర్తి చేయలేకపోవచ్చని తెలిపింది. బ్యాంకులు, టెలికామ్ శాఖల నుంచి అమ్మకానికి అంగీకారం తెలియజేస్తూ రావాల్సిన పత్రాలు అందకపోవడంతో పాటు ప్రభుత్వ అనుమతులు రాకపోవడమే ఇందుకు కారణంగా పేర్కొంది. అయితే ఎన్సీఎల్టీ ద్వారా అప్పుల చెల్లించేందుకు గ్రూప్ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది.