ముకేష్ అంబానీతో కేటీఆర్ భేటీ

ముకేష్ అంబానీతో కేటీఆర్ భేటీ

ముంబైలో ప్రతిష్ఠాత్మక ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ పర్ కార్పొరేట్ ఎక్సెలెన్స్, 2018 ప్రదానోత్సవం ప్రారంభమైంది. 400 మందికి పైగా వ్యాపార రంగంలో లబ్ధప్రతిష్టుల సమక్షంలో 9 మంది విజేతలకు అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులు అందజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డును తీసుకొనేందుకు కెసిఆర్ కుమారుడు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీతో ముచ్చటించారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో కెటిఆర్ మాట్లాడారు.