రిలయన్స్‌ సరికొత్త రికార్డు..

రిలయన్స్‌ సరికొత్త రికార్డు..

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ పంట పడుతోంది.. ఆయన ఆసియాలోనే అత్యంత సంప‌న్నుడిగా అవ‌త‌రించారు. దీనికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్‌)... ఇవాళ దేశ వ్యాపార చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. 10 లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ విలువను దాటిన తొలి భారతీయ కంపెనీగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఈ రోజు ట్రేడింగ్‌లో 1 శాతం పెరిగి 1,581 రూపాయల 60 పైసలకు చేరింది. ఇక, ఈ ఏడాదిలోనే షేర్ వాల్యూ ఏకంగా 40 శాతం పెరగడం మరో విశేషం. ఆ సంస్థ మార్కెట్ విలువ అక్టోబర్‌ 18వ తేదీ నాటికి 9 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా.. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసి చరిత్ర సృష్టించింది. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్న టీసీఎస్‌కు మార్కెట్‌ విలువకు భారీ వ్యత్యాసం ఉంది... ఈ రెండు సంస్థల మధ్య దాదాపు రూ.2 లక్షల కోట్ల వ్యత్యాసం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. 

రాబోయే 18 నెలలకు కంపెనీ చమురు మరియు రసాయన వ్యాపారంలో వాటాను సౌదీ అరాంకోకు అమ్మడం సహా లాంటి చర్యలు, కంపెనీ నికర రుణాన్ని సున్నాకి తగ్గించే ప్రణాళికలను ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్లో ఆర్‌ఐఎల్ పరుగు మెరుగుపడింది. ఎడెల్వీస్ సెక్యూరిటీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సున్నా నికర రుణ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందని, ఎందుకంటే ఇది ఎఫ్‌వై 21 లో సౌదీ అరామ్‌కో, బిపిల నుండి రూ .11.1 ట్రిలియన్లను పొందే అవకాశం ఉందంటున్నారు. ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద చమురు సంస్థగా బీపీ పీఎల్‌సీని అధిగమించిన కొద్ది రోజుల తరువాత ఆర్‌ఐఎల్ అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలి వాణిజ్యం మరియు టెలికాం వెంచర్ల ఆధారంగా 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన మొదటి భారతీయ కంపెనీగా ఆర్ఐఎల్ అవ్వగలదని గత నెలలో ఒక నివేదిక సూచించింది.