రిలయన్స్‌లో భారీగా విదేశీ పెట్టుబడులు..

రిలయన్స్‌లో భారీగా విదేశీ పెట్టుబడులు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ సంస్థలోకి భారీగా విదేశీ పెట్టుబడులు రానున్నట్టు ఆ సంస్థ ఛైర్మన్ ముకేష్ అంబానీ.. 42వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో  ఈ విషయాన్ని ప్రకటించారు ముకేష్. రిలయన్స్‌ చమురు, కెమికల్ బిజినెస్‌లో సౌదీ అరామ్‌కో కంపెనీ 20 శాతం పెట్టుబడులను పెట్టబోతోందని వెల్లడించారు. మొత్తం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సౌదీ అరామ్‌కో ద్వారా రాబోతున్నట్లు తెలిపిన ముకేష్.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద సంయుక్త భాగస్వామ్యమన్నారు. ఇక, పోయిన ఆర్థిక సంవత్సరం అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్‌ రికార్డు సృష్టించిందన్నారు ముకేష్.. రిలయన్స్‌ రిటైల్‌ రూ. లక్షా 30వేల కోట్ల బిజినెస్‌ చేసిందని.. భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్‌ భాగస్వామ్యం చాలా ఉందని వెల్లడించారు. మరోవైపు దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లించింది కూడా తమ కంపెనీయేనని... గత ఆర్థిక సంవత్సరంలో రూ. 67,320కోట్ల జీఎస్‌టీ కట్టినట్టు తెలిపారు.