రిలయన్స్ జియో ఆఫర్: 10 జీబీ డేటా ఫ్రీ

రిలయన్స్ జియో ఆఫర్: 10 జీబీ డేటా ఫ్రీ

రిలయన్స్ జియో వినియోగదారులకు శుభవార్త. రిలయన్స్ జియో సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 10 జీబీ 4జీ డేటాను వినియోగదారులందరికీ ఉచితంగా అందిస్తున్నది. అయితే వినియోగదారులకు 10 జీబీ డేటా 5 రోజుల పాటు వస్తుంది. డాటాను రోజుకు 2 జీబీ చొప్పున వినియోగదారులు వాడుకోవాల్సి ఉంటుంది. రోజు ఈ 2 జీబీ డేటా పూర్తయిన తర్వాత మీ ప్లాన్ లో ఉన్న డాటాను కూడా వినియోగించుకోవచ్చు. అయితే ఈ డేటా కస్టమర్ల జియో అకౌంట్‌లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుందో కంపెనీ ప్రకటించలేదు. గతంలో కూడా సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 8 జీబీ డేటాను వినియోగదారులందరికీ ఉచితంగా ఇచ్చిన విషయం తెలిసిందే.