వినియోగదారులకు జియో షాక్‌..! ఆ బడ్జెట్ ప్లాన్‌ తొలగింపు..

వినియోగదారులకు జియో షాక్‌..! ఆ బడ్జెట్ ప్లాన్‌ తొలగింపు..

కరోనా లాక్‌డౌన్‌తో డేటా వినియోగడం పెరగడంతో... వార్షిక ప్లాన్లపై దృష్టిపెట్టిన రిలయన్స్ జియో.. వినియోగదారులకు ఆకర్షిణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.. ఇక, ఇదే సమయంలో.. మరికొందరు వినియోగదారులకు షాకిస్తూ.. తన రూ.98 ప్లాన్ ను తొలగించింది. జియో బడ్జెట్‌ ప్లాన్‌గా ఉన్న రూ.98 ప్యాక్‌తో.. 2 జీబీ హై స్పీడ్ డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ వంటి బెనిఫిట్స్ అందిస్తూ వచ్చింది.. దీంతో ప్రస్తుతం జియోలో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్లలో రూ.129 ప్లానే బడ్జెట్‌ ప్లాన్‌గా చెప్పుకోవచ్చు.. రూ.98 జియో ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం జియో వెబ్ సైట్‌ నుంచి కూడా తొలగించింది.. ఈ ప్లాన్‌లో 2 జీబీ డేటా, జియో నుంచి జియోకు ఫ్రీ కాల్స్‌తో పాటు 300 ఎస్ఎంఎస్‌లు కూడా అందిస్తూ వచ్చింది..  ఇక, 2  జీబీ డేటా అయిపోయినా.. నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పడిపోయేది.. తాజాగా ఈ ప్లాన్‌ మాయం కావడంతో.. ఇప్పుడు 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్లలో రూ.129 ప్లానే బడ్జెట్‌ ప్లాన్‌గా నిలిచింది. దీని ద్వారా కూడా 2 జీబీ డేటా, జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 నిమిషాలు, 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. 

మరోవైపు కొత్త ప్లాన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది జియో.. రూ. 999 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. ఈ ప్లాన్‌తో ప్రతీ రోజూ 3జీబీ హైస్పీడ్‌ డేటా, అది పూర్తియితే 64 కేబీఎంఎస్‌ వేగంతో డేటా కనెక్టివిటీ లభిస్తుంది. కొత్త ప్లాన్‌లో అపరిమిత జియో-టు-జియో మరియు ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు మరియు జియోయేతర కాలింగ్ కోసం 3,000 నిమిషాలు ఉన్నాయి. ఇది రోజుకు 100 ఎంఎస్‌లు, కూడా అందిస్తుంది. జియోలో కూడా రూ. 599 మరియు రూ. 399 ప్రీపెయిడ్ ప్రణాళికలు 84 రోజుల వ్యాలిడిటీతో ఉన్నాయి.. వరుసగా ఈ ప్లాన్స్‌లో 2జీబీ డేటా, మరియు 1.5 జీబీ రోజువారీ డేటా అందిస్తోంది.