ఐపీఎల్‌ స్పెషల్‌.. జియో బంపరాఫర్లు...

ఐపీఎల్‌ స్పెషల్‌.. జియో బంపరాఫర్లు...

కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలో జియోకు బాగా తెలుసు.. అందుకే ఏ సీజన్‌నూ వదలకుండా.. అన్ని ఉపయోగించుకుంటుంది.. ఇప్పుడు ఐపీఎల్‌ను కూడా వదలకుండా.. ఆఫర్ల మొత మోగిస్తోంది రిలయన్స్ జియో.. ఓవైపు కరోనా పంజా విసురుతోన్న మరోవైపు.. ప్రేక్షకులు స్టేడియానికి అనుమతించకుండా.. ఐపీఎల్ 2021 సీజన్‌ను నిర్వహిస్తోంది బీసీసీఐ.. దీంతో.. టీవీలతో పాటు.. డిజిటల్ మీడియాలో ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేవారి సంఖ్య ఆమాంతం పెరిగిపోతోంది.. దీంతో.. ఐపీఎల్‌ను పురస్కరించుకుని జియో తమ ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ప్లాన్లపై తన ఖాతాదారులకు ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ అందించేందుకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం కూడా కదుర్చుకుంది జియో. 

రిలయన్స్ జియో కొత్త ఆఫర్లు పరిశీలిస్తే.. రూ.399 ప్లాన్‌తో సంవత్సరం పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది జియో.. పోస్టు పెయిడ్ ప్లస్ ప్లాన్స్‌ నెలకు రూ. 399తో ప్రారంభం కానుండగా.. మరోవైపు ప్రీపెయిడ్ ప్లాన్స్‌లోనూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్ చేస్తోంది జియో.. రూ. 401 నుంచి రూ. 2,599 మధ్య కొత్త ఆఫర్లను తెచ్చింది.. రూ. 401 జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాతోపాటు అదనంగా 6జీబీ డేటా లభించనుండగా.. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో  సంవత్సరం కాలం అందించనుండగా.. డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ 28 రోజుల కాలపరిమితితో అందించనుంది.. ఇక, రూ. 598 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 56 రోజుల పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్.. రూ. 777 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు 5జీబీ డేటా అదనం, అన్‌లిమిటెడ్ కాల్స్, 84 రోజుల పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్.. రూ. 2,599 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రోజుకు 2జీబీ డేటాకు 10 జీబీ డేటా అదనం, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏడాది పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.