ఫిబ్రవరిలో రిలయన్స్ జియో డౌన్ లోడ్ స్పీడ్ సూపర్

ఫిబ్రవరిలో రిలయన్స్ జియో డౌన్ లోడ్ స్పీడ్ సూపర్

ఫిబ్రవరిలో సగటున సెకన్ కి 20.9 మెగాబిట్ స్పీడ్ తో రిలయన్స్ జియో అన్నిటి కంటే వేగమైన 4జి నెట్ వర్క్ గా నిలిచింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుక్రవారం ఈ సమాచారం విడుదల చేసింది. జనవరితో పోలిస్తే భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ స్పీడ్ లు 9.4ఎంబీపీఎస్, 6.7ఎంబీపీఎస్ ల దగ్గర నిలకడగా ఉన్నాయి.

మెరుగైన ఐడియా డౌన్ లోడ్ స్పీడ్
ఫిబ్రవరిలో ఐడియా నెట్ వర్క్ సగటు డౌన్ లోడ్ స్పీడ్ మెరుగై 5.7 ఎంబీపీఎస్ అయింది. జనవరిలో ఇది 5.5 ఎంబీపీఎస్ గా ఉంది. వోడాఫోన్, ఐడియా సెల్యులార్ వ్యాపారాలు విలీనం అయ్యాయి. ఇప్పుడు ఇవి వోడాఫోన్ ఐడియా పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కానీ ట్రాయ్ ఈ రెండు నెట్ వర్క్ ల ప్రదర్శన గణాంకాలను వేర్వేరుగా విడుదల చేసింది.

సగటు అప్ లోడ్ స్పీడ్ విషయంలో వోడాఫోన్ మిగతా నెట్ వర్క్ ల కంటే ముందుంది. ఫిబ్రవరిలో వోడాఫోన్ అప్ లోడ్ స్పీడ్ 6ఎంబీపీఎస్ గా ఉంది. గత నెలలో ఇది 5.4 ఎంబీపీఎస్ మాత్రమే ఐడియా, ఎయిర్ టెల్ ల సగటు 4జి అప్ లోడ్ స్పీడ్ లు తగ్గి వరుసగా 5.6 ఎంబీపీఎస్, 3.7 ఎంబీపీఎస్ గా ఉన్నాయి. జియో సగటు అప్ లోడ్ స్పీడ్ కొంత మెరుగై 4.5ఎంబీపీఎస్ కి చేరింది.