జియో తెచ్చింది మరో ఫ్రీ ఆఫర్..

జియో తెచ్చింది మరో ఫ్రీ ఆఫర్..

సంచలనాలకు మారుపేరైన రిలయన్స్ జియో.. తాజాగా ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ పేరుతో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు వడ్డిస్తూ నిర్ణయం తీసుకుంది. అలా ప్రకటించి.. తర్వాత రోజు నుంచే అమల్లోకి తెచ్చింది.. అయితే.. అక్టోబర్ 9, అంతకు ముందే రీచార్జ్ చేసుకున్న ప్లాన్లకు వర్తించదని.. మీ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత చేసుకునే కొత్త రీచార్జ్‌తో ఈ వడ్డింపు స్టార్ట్ అవుతుందని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. అయితే, జియో నిర్ణయంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.. దీంతో.. తన ఖాతాదారులను కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే తీపి కబురు చెప్పింది జియో.. తాజా ప్రకటన ప్రకారం.. తొలిసారి రీచార్జ్ చేయించుకున్న ఖాతాదారులకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైం ఇవ్వనున్నట్టు పేర్కొంది. రీచార్జ్ ప్లాన్లు ప్రకటించిన తొలి వారం రోజులు మాత్రమే ఈ వన్-టైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంటే, తన నెట్‌వర్క్‌ పరిధిలో కాల్స్‌కి ఫ్రీ అయినా.. ఇతర నెట్‌వర్క్‌లకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తుండగా.. ఈ 30 నిమిషాల ఫ్రీ టాక్ టైం వారికి వర్తింపజేయనుంది. కాగా, ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌పై 6 పైసల వసూలు చేస్తున్నట్టు ప్రకటించిన కేవలం 48 గంటల్లోనే ఈ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది జియో.