జియోః 5,000 మంది ఉద్యోగులపై వేటు

జియోః 5,000 మంది ఉద్యోగులపై వేటు

కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్స్‌ అంటే నిర్వహణా లాభం పెంచే లక్ష్యంతో  రిలయన్స్‌ జియో ఏకంగా 5,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో పోటీ ఎక్కువ కావడం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చాల్సిన రావడంతో కంపెనీ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మంది పర్మనెంట్‌ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే ఉద్యోగులను తాము తొలగించినా... చేర్చుకున్నవారు కూడా అధికంగా ఉన్నారని...నికరంగా తమ వద్ద ఉద్యోగుల సంఖ్య పెరిగిందని రిలయన్స్‌ జియో అంటోంది. జవనరి నుంచి మార్చి మధ్య కాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను జియో తొలగించింది. తాము కన్జూమర్‌ బిజినెస్‌ పరిధి పెంచుతున్నామని, కాంట్రాక్టర్లతో కూడా తాము చర్చలు జరిపి కొత్త ఉద్యోగులను తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. వివిధ రకాల నిర్మాణ పనుల కోసం ఫిక్సెడ్‌ టైమ్‌ ఉద్యోగులను తీసుకుంటున్నామని జియో అధికారులు అంటున్నారు. జియో వద్ద ప్రస్తుతం 15 వేల నుంచి 20 వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా.