షాకింగ్..! జియో కూడా వారి దారిలోనే..

షాకింగ్..! జియో కూడా వారి దారిలోనే..

అన్నీ ఉచితమంటూ టెలికం రంగంలో ప్రవేశించిన రిలయన్స్ జియో.. ఆ తర్వాత టారిఫ్ ప్లాన్స్ తెచ్చినా.. ఆగకుండా ఓ సునామీలా తమ వినియోగదారులను పెంచుకుంటూ పోయింది.. ఇక, కొత్త ప్లాన్లతో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటున్నా.. గత నెల నుంచి నాన్ జియో కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తోంది. ఇక, రాబోయే కొద్ది వారాల్లో మొబైల్ ఫోన్ కాల్ మరియు డేటా ఛార్జీలను పెంచుతామని బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇవాళ సంచలన ప్రకటన చేసింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వచ్చే నెల నుండి కాల్, డేటా ఛార్జీల పెంపును ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన చేసింది జియో. టెలికాం సుంకాల సవరణ కోసం టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని జియో పేర్కొంది. 

దీనిపై ఓ ప్రకటన విడుదల చేసిన రిలయన్స్ జియో.. టారిఫ్స్ పెంచబోతున్నాం.. ఇది డేటా వినియోగం, డిజిటల్ స్వీకరణలో వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేయదు.. పెట్టుబడులను కొనసాగిస్తుందని పేర్కొంది. ఇతర ఆపరేటర్లలానే మేం కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని జియో పేర్కొంది. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు, పరిశ్రమను బలోపేతం చేసేందుకు ట్రాయ్ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. రాబోయే కొద్ది వారాల్లో టారిఫ్‌లను పెంచుతున్నామని పేర్కొంది. అన్నీ వచితమంటూ వల విసిరిసన జియో.. క్రమంగా వినియోగదారుడికి జేబుకు చిల్లు పడేలా తన ప్రణాళికలను అమలు చేస్తూ వస్తోంది. కాగా, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా లిమిటెడ్.. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త టారీఫ్‌లను అమలు చేయనున్న సంగతి తెలిసిందే.