అనిల్ అంబానీ కంపెనీపై దివాలా పిటీషన్

అనిల్ అంబానీ కంపెనీపై దివాలా పిటీషన్

రాఫెల్ డీల్ వివాదంతో సతమతమౌతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నావల్  అండ్‌ ఇంజినీరింగ్ కంపెనీపై దివాలా పిటీషన్ వేసింది ఐడీబీఐ బ్యాంక్. తనకు రావాల్సిన రూ. 1,250 కోట్ల రుణాలను చెల్లించడంలో కంపెనీ విఫలమైందని అహ్మదాబాద్ లని నేషనల్‌ కంపెనీ లా ట్ర్యైబ్యునల్ లో బ్యాంక్ పిటీషన్ వేసింది.  ఈ ఏడాది మార్చి నెలాఖరుకు వివిధ బ్యాంకులకు కంపెనీ చెల్లించాల్సిన రుణ బకాయిలు రూ. 53489.17 కోట్లకు చేరాయి. కంపెనీ వ్యాల్యూయేషన్ వేయించగా మార్చి 2018 నాటికి రిలయన్స్ నావల్ నికర మార్కెట్ విలువ రూ. 1880 కోట్లను ఓ సంస్థ మదింపు వేయగా, మరో సంస్థ రూ. 1535 కోట్లుగా లెక్క గట్టిందని ఐడీబీఐ బ్యాంక్ తన పిటీషన్ లో పేర్కొంది. 
ప్రస్తుతం కంపెనీ నిర్మిస్తున్న డాక్ 2 ప్రాజెక్టు వ్యయం తడిసిమోపెడు కావడం, వచ్చిన కాంట్రాక్టులు క్యాన్సిల్ కావడంతో పాటు కమర్షియల్ షిప్ బిల్డింగ్ పరిశ్రమే మందగించడంతో కంపెనీ ఘోరంగా దెబ్బతింది.  రిలయన్స్ నావల్ ను రిలయన్స్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ నిర్వహిస్తోంది. రుణాల పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా కూడా కంపెనీని గాడిలో పెట్టేందుకు  బ్యాంకులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వన్‌ టైమ్ సెటిల్ మెంట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఏడాది మార్చి నాటికి రిలయన్స్ నావల్ రూ. 378 కోట్ల అమ్మకాలపై రూ.1,011 కోట్ల నికర నష్టాన్ని పొందింది.