3 నెలల నికర లాభం రూ.10,362 కోట్లు

3 నెలల నికర లాభం రూ.10,362 కోట్లు

దేశంలోని అతి పెద్ద కార్పొరేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 10,362 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 10 శాతం పెరిగింది. కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి.  మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా 19.40 శాతం పెరిగి రూ. 1,54,110 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్‌ రిటైల్‌ విభాగానికి పూర్తి ఏడాదికి లక్ష కోట్ల ఆదాయం వచ్చినట్లు కంపెనీ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ అన్నారు.  

పెట్రో కెమికల్స్‌ అమ్మకాలు రూ. 42410 కోట్లు కాగా,  రిఫైనింగ్‌ అమ్మకాల మొత్తం రూ. 8,784 కోట్లని కంపెనీ తెలిపింది. గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌ బ్యారెల్‌ 8.2 డారల్లకు తగ్గినా... కంపెనీ అద్భుత పనితీరు కనబర్చింది. డిసెంబర్‌ 20018తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ  గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌ బ్యారెల్‌కు 11 డాలర్లు. మార్చి నెలాఖరునాటికి కంపెనీ రుణాలు రూ. 2,87,505 కోట్లకు చేరాయి. ఒక్కో షేరుకు రూ. 6.50 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది.