రిలయన్స్ సెజ్ ఏర్పాటుకు రంగం సిద్ధం

రిలయన్స్ సెజ్ ఏర్పాటుకు రంగం సిద్ధం

తిరుపతి సమీపంలోని 150 ఎకరాల్లో 'రిలయన్స్ ఎలక్ట్రానిక్  సెజ్ 'ఏర్పాటు కానుంది. జనవరిలోనే ఈ సెజ్ కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొననున్నారు. రిలయన్స్ సంస్థ సుమారు రూ.15వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న ఎలక్ట్రానిక్స్ సెజ్ లో జియోఫోన్లు, సెట్ టాప్ బాక్స్ లతో పాటు రోజుకు దాదాపు పది లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉత్పత్తి కానున్నాయి.