తక్కువ ధరకే సూపర్ ఫాస్ట్ బ్రాడ్ బ్యాండ్

తక్కువ ధరకే సూపర్ ఫాస్ట్ బ్రాడ్ బ్యాండ్

దేశీయ ప్రైవేటు టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్‌ జియో టెలికాం సేవల రంగంలో మరింత దూసుకుపోతోంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలతో కస‍్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. జియో తరహాలో మరో సంచలనం సృష్టించనుంది. ఫైబర్ టు హోం పేరుతో సూపర్ ఫాస్ట్ బ్రాండ్ బ్యాండ్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. జియోతో టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదిపేశారు ముఖేష్ అంబానీ. ఇంటర్నెట్ ప్రపంచంలో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారు. దేశ బ్రాడ్ బ్యాండ్ రూపురేఖల్నే మార్చేసే ఓ పవర్ ఫుల్ ఆయుధాన్ని త్వరలోనే మార్కెట్ లోకి ప్రవేశ పెట్టనుంది. ఫైబర్ టు హోం పేరుతో రాబోతున్న ఈ సర్వీసులు ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నాంది పలుకనున్నాయి. ఇటీవల ఎయిర్ టెల్ కూడా తన కష్టమర్లను నిలుపుకునేందుకు, కొత్త వినియోగ దారులను ఆకర్షించేందుకు టారీఫ్ ను తగ్గించింది. వారితో పోటీ పడేందుకు రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్రాడ్ బ్యాండ్ సెగ్నెంట్ లో ఈ ఈ రెండు కంపెనీల మధ్య వార్ నడుస్తోంది. టారీఫ్ లు పోటీపడీ మరీ తగ్గిస్తున్నాయి. జియో త్వరలో 100ఎంబీపీఎస్, అన్ లిమిటెడ్ డాటాను అతి తక్కువ ధరకు ఇచ్చేందుకు రెడీ అవుతోంది.