చిరంజీవిపై కేసును కొట్టేసిన హైకోర్టు !

చిరంజీవిపై కేసును కొట్టేసిన హైకోర్టు !

గత ఐదేళ్లుగా నడుస్తున్న ఒక కేసు నుండి మెగాస్టార్ చిరంజీవికి ఊరట లభించింది.  ప్రజారాజ్యం పెట్టి ఎన్నికల ప్రచారం చేసే సయమంలో ఆయనపై ఈ కేసు నమోదైంది.  2014 ఏప్రిల్ 27న నిర్దేశించిన సమయం దాటిపోయినా చిరంజీవి అర్థరాత్రి ప్రచారం చేశారని గుంటూరు అరండల్ పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.  దీనిపై చిరు ఉమ్మడి హైకోర్టులు పిటిషన్ దాఖలు చేశారు.  బుధవారం జరిగిన విచారణలో చిరు తరపు న్యాయవాది ప్రచారం ముగించుకుని వెళుతుంటే చిరంజీవిపై కావాలని ఈ తప్పుడు కేసును పెట్టారని వాదనలు వినిపించారు.  వాదనలు విన్న జస్టిస్ రజని కేసును కొట్టివేశారు.