దయచేసి నాకూ, నా మాజీ భర్త ఫ్యాన్స్ కు మధ్య గొడవలూ సృష్టించకండి..

దయచేసి నాకూ, నా మాజీ భర్త ఫ్యాన్స్ కు మధ్య గొడవలూ సృష్టించకండి..

మీడియాలో.. సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేయడం కామనే. కొన్ని సార్లు ఇలాంటి వార్తలపై సదరు సెలబ్రెటీలు ఘాటుగానే స్పందిస్తారు. తాజాగా ఇలాంటి ఓ వార్త విషయంలో స్పందించారు నటి రేణుదేశాయ్ .ఇటీవల రేణుదేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్ తన పిల్లలకోసం ఒక ఖరీదైన బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చారని  వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. ఇది  ఆనోటా ఈ నోటా పడి చివరకు రేణుదేశాయ్ దగ్గరకు చేరింది. ఇక ఈ విషయం పై ఆమె మాట్లడుతూ.. పవన్ తనకు ఏలాంటి ఆస్తిని ఇవ్వలేదని..తన పిల్లలతో సంతోషంగా గడుపుతున్నాని అన్నారు. నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్దతతో ఎంతగానో శ్రమిస్తున్నాను. శ్రమిస్తూనే పోరాడుతున్నాను.నా తండ్రి దగ్గరనుంచి కూడా ఒక్కరూపాయి తీసుకోలేదు. హైదరాబాద్ లో నేను కొన్న ఇల్లు నా కష్టార్జితం, ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కొన్నాను. నాకు తెలిసి ఈ వార్త నా మాజీ భర్త పవన్ వరకు చేరి ఉండదు. ఒక వార్తను రాసేటప్పుడు, అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడకోసమో, ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం..? నిజాలు తెలియకుండా న్యూస్ ను స్ప్రెడ్ చెయ్యకండి. దయచేసి నాకూ ... నా మాజీ భర్త అభిమానులకు మధ్య గొడవలు సృష్టించకండి" అని రేణుదేశాయ్ అన్నారు.