ఏపీలో మరో 2 చోట్ల రీపోలింగ్‌

ఏపీలో మరో 2 చోట్ల రీపోలింగ్‌

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది. రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ రెండింటితోపాటు మొత్తం 7 కేంద్రాల్లో ఆదివారం రీపోలింగ్‌ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు.  తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేయాలని ప్రద్యుమ్న పిలుపునిచ్చారు.