బోగీలో ఇరుక్కుపోయిన లోకోపైలెట్ ను కాపాడిన రైల్వే శాఖ

బోగీలో ఇరుక్కుపోయిన లోకోపైలెట్ ను కాపాడిన రైల్వే శాఖ

8 గంటల కఠిన మైన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఎంఎంటిఎస్ రైలు నడుపుతున్న లోకో పైలట్ శేఖర్ ను రైల్వే అధికారులు క్షేమంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ని చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు. కాచిగూడ రైల్వేస్టేషన్ లో ఆగివున్న హంద్రీ నీవా ఎక్స్ ప్రెస్ రైలును ఫలక్ నుమా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలు బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రమాణికులు గాయపడ్డారు. ఎంఎంటీఎస్ క్యాబిన్ ముందు భాగం నుజ్జునుజ్జయిపోవడంతో లోకోపైలెట్ అందులోనే చిక్కుకుపోయాడు. బయటికి వచ్చే మార్గంలేక విలవిల్లాడిపోయాడు. తీవ్రంగా శ్రమించిన అధికారులు ఎట్టకేలకు అతడిని బయటికి తీసుకువచ్చి కేర్ ఆసుపత్రికి తరలించారు.