ఈ సెన్స‌ర్ తో రోగ నిర్ధారణ వెరీ ఈజీ

ఈ సెన్స‌ర్ తో రోగ నిర్ధారణ వెరీ ఈజీ

Photo credit: Washington University

వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు కొత్త రకమైన సెన్స‌ర్  ను తయారు చేశారు. బయో ఫ్యూయెల్ ఆధారంగా పనిచేసే అతి చిన్న సెన్స‌ర్  ను మానవ శరీరంలో అమర్చడం ద్వారా... శరీరంలోని షుగర్, బీపీతో పాటు ఇతర జీవక్రియలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీంతో రోగాన్ని, రోగ లక్షణాలను గుర్తించడం, నిర్ధారించడం వంటి కీలకమైన సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దీంతో ట్రీట్ మెంట్ సులువవుతుంది. 

మానవ శరీరంలో నిరంతరం ఉత్పత్తయ్యే షుగర్, గ్లూకోజ్ వంటి ఇంధనాలను ఉపయోగించుకొని అందులోని బ్యాటరీ పని చేస్తుంది. ఇంతకుముందు చిన్న వాచీ రూపంలో లేదా చర్మం కింద వేసుకునే ప్యాచ్ రూపంలో ఈసెన్సర్లు ఉండేవి. కానీ ఇప్పుడు అతి సూక్ష్మమైన బయో ఫ్యూయెల్  సెన్స‌ర్  ల కారణంగా అతి తక్కువ కరెంటుతో ఎల్లప్పుడూ పని చేసేలా సెన్సార్ ను తయారు చేశారు. షుగర్ టెస్ట్ చేయాలంటే వేలి మీద నీడిల్ తో గుచ్చి బ్లడ్ టెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరమే ఉండదిక. ఎలాంటి శారీరక టెస్ట్ లతో పని లేకుండా ఈ బయోఫ్యూయెల్ సెన్సర్ పని చేస్తుంది. . ప్రొఫెసర్ సుభాంశు గుప్తా ఆధ్వర్యంలో ఈ సెన్స‌ర్  ను రూపొందించారు. దీన్ని మరిన్ని పరీక్షలకు గురి చేసి, రెగ్యులేటరీ అనుమతులు పొందాక విడుదల చేసే అవకాశం ఉంది.