కరోనా వైరస్ ఒకటి కాదు...73 రకాలు...!!

కరోనా వైరస్ ఒకటి కాదు...73 రకాలు...!!

గత 8 నెలలుగా ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది.  చైనాలో మొదలైన ఈ వైరస్ మెల్లిగా ప్రపంచం మొత్తం విస్తరించింది.  ఇప్పుడు ఇండియాలో ఈ వైరస్ విజృంభణ అధికంగా ఉన్నది.  అత్యధిక జనాభా, జనసాంద్రత ఉన్న ఇండియాలో కరోనా వైరస్ ను అడ్డుకోవడం కొంతమేర కష్టమే అవుతుంది.  అయినప్పటికీ దేశంలోని ప్రభుత్వాలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు యొక్క రూపాంతరాలపై పరిశోధనలు చేశారు.  కరోనా వైరస్ 73 రకాలుగా రూపాంతరం చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.  

సిఎస్ఐఆర్, ఐజీఐబి తో పాటుగా భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ఎస్ఎంయు ఆసుపత్రి పరిశోధకలు కలిసి కరోనా వైరస్ రూపాంతరాలపై పరిశోధనలు చేశారు. కోవిడ్ 19 జాతిలో 73 రూపాలు ఉన్నట్టు గుర్తించారు.  కరోనా జాతిలో బి 1.112, బి 1 అనే రెండు వంశాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల సారాంశాన్ని పరిశోధలన డేటాను ఆన్లైన్ లో ఉంచినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జయశంకర్ దాస్ తెలిపారు.  వైరస్ బలహీనతలను గుర్తిస్తే దానికి విరుగుడు కనుక్కోవడం ఈజీ అవుతుందని అయన తెలిపారు.