కాశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేత.. కొన్ని చోట్ల మినహా..!!

కాశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేత.. కొన్ని చోట్ల మినహా..!!

ఆగష్టు 5 వ తేదీన జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత అల్లర్లు జరగకుండా అక్కడ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.  చాలా రోజుల క్రితమే జమ్మూలో ఆంక్షలను ఎత్తివేశారు.  అక్కడ పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయి.  అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.  పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపారాలు మాములుగా జరుగుతున్నాయి.  

నిన్నటి వరకు కాశ్మీర్ లో దీనికి విరుద్ధంగా ఉన్నది.  శ్రీనగర్లోని చాలా ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉండేవి.  అయితే, శ్రీనగర్లో ఇప్పుడు ఆంక్షలను ఎత్తివేశారు.  చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.  శ్రీనగర్లోని లాల్ చౌక్ ఏరియాలో ఆంక్షలను ఎత్తివేశారు.  చాలాకాలం తరువాత దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి.  పాఠశాలలు తెరుచుకున్నా.. పిల్లలు మాత్రం స్కూల్ కు వెళ్లడం లేదు.  సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే ఆంక్షలు అమలులో ఉన్నాయి.  మరికొన్ని రోజుల్లో అక్కడ కూడా వీటిని ఎత్తివేస్తారని అంటున్నారు.