స‌మ్మోహ‌నం హిట్టా ఫ‌ట్టా?

స‌మ్మోహ‌నం హిట్టా ఫ‌ట్టా?

సుధీర్‌బాబు - అదితీరావ్ జంట‌గా ఇంద్ర‌గంటి తెర‌కెక్కించిన‌ `స‌మ్మోహ‌నం` క్లాసిక్ సినిమా అన్న టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. మంచి సినిమానే కానీ, అంటూ ప్ర‌స్తుతం ట్రేడ్‌లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. అస‌లింత‌కీ ఈ సినిమా హిట్టా? ఫ‌ట్టా? అని ప్ర‌శ్నిస్తే ట్రేడ్ విశ్లేష‌కులు తేల్చిన సంగ‌తి ఇదీ.. 

ఈ సినిమాని కేవ‌లం 9 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. లైఫ్ టైమ్ 6కోట్లు వసూలైంది. శాటిలైట్ రూపంలో మ‌రో 3కోట్లు నిర్మాత‌కు ద‌క్కింది. అంటే ఓవ‌రాల్‌గా పెట్టిన‌ డ‌బ్బు తిరిగొచ్చినా లాభాల్లేవని తేలింది. ఇక ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ త‌ర‌వాత తెలుగులో సుధీర్‌బాబుకి ఫ‌ర్వాలేద‌నిపించిన సినిమా ఇది. అమెరికాలో హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ మార్క్‌తో సుధీర్ మార్కెట్ మెరుగైంద‌ని తెలుస్తోంది. అలానే ఈ సినిమా అస‌లు నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌ కాదు, వేరొక స్లీపింగ్ ప్రొడ్యూస‌ర్ పెట్టుబ‌డి పెట్టార‌ని మాట్లాడుకుంటున్నారు.