రిటైర్డ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత

రిటైర్డ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత

రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స పొందుతూ  బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. ఇద్దరు న్యాయవాద వృత్తిలో ఉండగా, మరొకరు ఇంజనీరుగా పని చేస్తున్నారు. గతంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గాను, లోకాయుక్త చైర్మన్‌ గానూ సుభాషణ్ రెడ్డి సేవలందించారు. మరోవైపు జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.