విషాదం: తల్లి మృతి.. అంత్యక్రియలకు వెళ్తున్న కొడుకు, కోడలు మృతి

విషాదం: తల్లి మృతి.. అంత్యక్రియలకు వెళ్తున్న కొడుకు, కోడలు మృతి

స్వగ్రామంలో తల్లి కన్నుమూసింది... ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బయల్దేరిన కుమారుడు కుటుంబాన్ని కూడా రోడ్డు ప్రమాదం బలిగొన్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాలోని యాపల్‌గూడలో నిన్న రాత్రి అనారోగ్యంతో రమణమ్మ మృతి చెందింది. చనిపోయిన తల్లి అంత్యక్రియలకు నిర్వహించేందుకు స్వగ్రామానికి బయల్దేరాడు.. ఇంతలోనే వరంగల్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో కుమారుడు, రిటైర్డ్ సీఐ విజయ్‌కుమార్ మృతిచెందాడు.. ఆయనతో పాటు ఆయన భార్య కూడా కన్నుమూసింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంలో విషాదం చోటు చేసుకుంది.