చంద్రబాబుకు రిటైర్డ్ ఐఎఎస్ ల లేఖ

చంద్రబాబుకు రిటైర్డ్ ఐఎఎస్ ల లేఖ

ఏపీ ప్రభుత్వ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లపై చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వాడిన భాష సరికాదంటూ హితవు పలికారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం నిబద్ధత గల అధికారి అని కొనియాడారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని హైకోర్టు తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఏపీ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేదిపై చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబు వెంటనే ఐఏఎస్‌లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌లు శ్రీపాద భలే రావు, కేవీరావు, టీఎస్‌ అప్పారావు, ఏకే పరీదా, ఎస్‌కే సిన్హా, సుతీంద్ర భట్టాచార్య, విద్యాసాగర్‌, ఎంజీ గోపాల్‌, సీవీఎస్‌కే శర్మ తదితరులు లేఖలో బాబు తీరును తప్పుబట్టారు.