ఐపీఎస్ అధికారి సూసైడ్ నోట్ కలకలం 

ఐపీఎస్ అధికారి సూసైడ్ నోట్ కలకలం 

పశ్చిమ బెంగాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి గౌరవ్ దత్ రాసినట్టు చెబుతున్న ఓ సూసైడ్‌నోట్  పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది.  తన ఆత్మహత్యకు సీఎం మమతా బెనర్జీ వేధింపులే కారణమంటూ దత్ పేర్కొన్నారు. ఇది ప్రతిపక్ష బీజేపీకి ఆయుధంగా మారింది.  ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడటం పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే మొదటిసారి అని బీజేపీ నేత ముఖుల్ రాయ్ విమర్శించారు. ఆత్మహత్యకు కారణమైన సీఎం మమతను అరెస్టు చేయాలనీ, ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని ప్రస్తుతం దత్ రాసిన సూసైడ్ నోటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.  తనకు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ‘కంపల్సరీ వెయిటింగ్‌’లో పెట్టడం ద్వారా సీఎం మమత తన ఆత్మహత్యకు కారణమయ్యారని అధికారి ‘సూసైడ్ నోట్’లో పేర్కొన్నారు.  2018 డిసెంబర్ 31న తాను రిటైరైన తర్వాత రావాల్సిన డబ్బులు కూడా చెల్లించలేదని ఆరోపించారు. గత మంగళవారం కోల్‌కతాలోని తన నివాసంలో దత్ ఆత్మహత్య చేసుకున్నారు. మణికట్లు కోసుకుని, రక్తపు మడుగులో పడిఉన్న ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.