వరల్డ్‌కప్‌కి ఇంగ్లండ్‌ న్యూలుక్‌ 

వరల్డ్‌కప్‌కి ఇంగ్లండ్‌ న్యూలుక్‌ 

మరో 8 రోజుల్లో ప్రారంభమయ్యే క్రికెట్‌ ప్రపంచ్‌ కప్‌కి అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. కొన్ని జట్లు ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లండ్‌కు బయలుదేరాయి. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవాలని పట్టుదలతో ఉన్న ఇంగ్లండ్‌ న్యూ లుక్‌తో రెడీ అయ్యింది. ఈ టోర్నీలో తమ జట్టు ఆటగాళ్లు ధరించే జెర్సీని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు విడుదల చేసింది. రెగ్యులర్‌గా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ధరించే డార్క్‌ బ్లూకు బదులుగా లైట్‌ కలర్‌లో ఈ జెర్సీలను డిజెన్‌ చేశారు. 1992 వరల్డ్‌కప్‌లో  ఇంగ్లండ్‌ జట్టు ఫైనల్స్‌ వరకు వెళ్లింది. అప్పుడు కూడా ఆ టీమ్‌ లైట్ బ్లూ జెర్సీలనే ఉపయోగించింది. ఈ లేత నీలం రంగు.. హోమ్‌ టీమ్‌కు అదృష్టాన్ని తీసుకొస్తుందేమో చూడాలి.