కేసీఆర్‌.. ఇప్పుడేమంటారు?

కేసీఆర్‌.. ఇప్పుడేమంటారు?

కర్ణాటక ఎన్నికలకు ముందు జేడీఎస్‌కు మద్దతిచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పడు తన అభిప్రాయాన్ని చెప్పాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 'ఇప్పుడు కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిశాయి. దీనిని కేసీఆర్ సమర్థిస్తారా ? వ్యతిరేకిస్తారా ?' అని ప్రశ్నించారు. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో గవర్నర్ పాత్రపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశం లేకుండా గవర్నర్ నియంత్రించాలని రేవంత్‌ అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉన్నందునే ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తామని చెప్పారన్నారు.  నీచమైన బీజేపీ..పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని రేవంత్‌ మండిపడ్డారు. రాజ్యాంగం పై మోడీ, అమిత్ షాలకు గౌరవం లేదన్నారు. వీరిద్దరూ కలిసి బీజేపీని చెరబట్టారని రేవంత్‌ విమర్శించారు. నైతిక విలువలు ఉన్న రాహుల్ గాంధీ తో పోల్చుకోవడానికి మోడీ సరిపోరని అన్నారు.