రేవంత్ రెడ్డి ఎక్కడ... నిన్నటి నుంచి పోలీసుల వేట !

రేవంత్ రెడ్డి ఎక్కడ... నిన్నటి నుంచి పోలీసుల వేట !

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు కీలక నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. మరోవైపు, ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ వంటి నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు వర్ధన్నపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ఎల్బీనగర్‌లలో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ప్రగతి భవన్ ముట్టడికి తరలి వస్తున్న జగిత్యాల, సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులకు ఆయన ఆచూకీ లభించలేదు. ఇంటి వద్ద ఆయన కనిపించలేదు, నిన్న రాత్రి నుంచి ఇంట్లో రేవంత్ లేరు. దీంతో, రేవంత్ కోసం ఆయన అనుచరుల ఇళ్లలో కూడా పోలీసులను సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో ప్రగతి భవన్ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.