రేవంత్‌రెడ్డి రాజీనామా..

రేవంత్‌రెడ్డి రాజీనామా..

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్ఫూర్తితో రాజీనామా చేశానని ప్రకటించన రేవంత్‌.. ఎలాంటి పదవి లేకపోయినా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని చెప్పారు. ఎన్నికల్లో ఘోర పరాజయానికి తనతోపాటు మిగతా నేతలు కూడా బాధ్యత తీసుకోవాలని ఇటీవలే రాహుల్‌ గాంధీ సూచించారు. ఈక్రమంలో అనేకమంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న పొన్నం ప్రభాకర్‌ కూడా ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు.