కేసీఆర్ పాలన నవాబు పాలనను తలపిస్తుంది

కేసీఆర్ పాలన నవాబు పాలనను తలపిస్తుంది

నిజాం నవాబు పాలనను కేసీఆర్ పాలన తలపిస్తుంది అని టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఏర్పాట్లను పరిశీలించారు, రాజకీయ పార్టీల ఫిర్యాదులను స్వీకరించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ మీడియా సంస్థలపై ఫిర్యాదు చేశాం. కాంగ్రెస్ పై పలు ఛానెల్స్ బురద జల్లుతున్నారు.. మా ప్రచారం గురించి చూపించడం లేదు. ప్రచార ప్రసార సాధనలు అనే హోదా తీసేసి, నిషేధం విధించాలని కోరాం అని తెలిపారు. పింక్ బ్యాలెట్ పత్రాలను కూడా మార్చాలని సీఈఓకు ఫిర్యాదు చేశామన్నారు. పత్రికలు విలువలను, సిద్ధాంతాలను విస్మరిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోతే మేము న్యాయస్థానం తలుపు తడతామని అయన తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావు మరికొందరు కేసీఆర్ కు ప్రైవేటు సైన్యంగా పని చేస్తూన్నారన్నారు.

డిసెంబర్ 13న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన అధికారుల కోసం ప్రత్యేక డైరీ పెట్టినం. వీళ్ళు చేసే పనులన్నీ అందులో పొందుపరిచి తగిన గుణపాఠం చెబుతాం అని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో డీజీపీగా ఉన్న యాదవ్ ను మార్చి మహంతిని డీజీపీగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ అధికార నివాసాన్ని రాజ్యాంగేతర శక్తులు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపై ఐటీ అధికారులు నిఘా పెట్టాలి. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే కేటీఆర్ కు సిగ్గనిపించలేదా అని మండిపడ్డారు. ఆంద్ర వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే వెళ్లి అక్కడ వాళ్ళ కడుపులో తల పెట్టాల్సిన అవసరం లేదు. రెండు ప్రభుత్వాలు వేరు అనుకుంటే ఆంధ్ర ప్రభుత్వం ముందు మొకరిల్లాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి దరిద్రం పట్టింది.. తప్పుడు విధానాలకు కేసీఆర్ బీజం వేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.