'తెలుగు హీరోలు కళ్లు లేని కబోదులు' 

'తెలుగు హీరోలు కళ్లు లేని కబోదులు' 

తెలుగు సినిమా హీరోలు కళ్లు లేని కబోదులని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ గ్రీన్‌ ఛాలెంజ్‌ పేరుతో మంత్రులు చెప్పినప్పుడు మొక్కలు నాటే సినిమా హీరోలు.. తెలంగాణ ప్రభుత్వం వందలాది చెట్లను నరికేస్తుంటే నోరు మెదపకపోవడం దారుణమన్నారు. 'మంత్రులు చెప్పినప్పుడే హీరోలు నోరు విప్పుతారా? మంత్రులు చెప్పినట్టే చేస్తారా?' అని ప్రశ్నించారు. గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కూడా కళ్లకు గంతలు కట్టుకున్నట్టుందని రేవంత్‌ ఎద్దేవా చేశారు. తక్షణమే కేసీఆర్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.