రివ్యూ: హలో గురు ప్రేమ కోసమే

రివ్యూ: హలో గురు ప్రేమ కోసమే

నటీనటులు: రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత సుభాష్, ప్రకాష్ రాజ్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

సినిమాటోగ్రఫీ: విజయ్ కె చక్రవర్తి 

నిర్మాత: దిల్ రాజు 

దర్శకత్వం : త్రినాథరావ్ నక్కిన 

రిలీజ్ డేట్ : 18-10-2018 

హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్ లు కలిసి నటించిన చిత్రం ' హలో గురు ప్రేమ కోసమే'.  త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది.  మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం.. 

కథ: 

సంజు (రామ్) ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి తన అంకుల్ (ప్రకాష్ రాజ్) ఇంట్లో ఉంటాడు. అతని కూతురు (అనుపమ)తో ప్రేమలో పడతాడు.  కానీ ఇవేవీ తెలియని అనుపమ అతనితో స్నేహంగా ఉంటుంది.  తీరా సంజు ప్రేమించేది తన కుమార్తెనేనని తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆమెను ఎలా కాపాడుకున్నాడు, సంజు అనుపమకు ఎలా ప్రేమలో పడేశాడు, ఆమె తండ్రిని ఎలా ఒప్పించాడు అనేదే సినిమా. 

విశ్లేషణ :

సినిమా మొదటి భాగం ఎంటెర్టైనింగా బాగుంది.  రామ్, ప్రణీతలు మధ్యన నడిచే కామెడీ సీన్స్ కొత్తగా ఉండి నవ్వించాయి.  కథనంలో సరిగ్గా ఇమిడిపోయిన ఈ సీన్స్ బాగా పండాయి.  హీరో రామ్ ఎప్పటిలాగానే క్యాజువల్ అబ్బాయి పాత్రలో మెప్పించాడు.  డ్యాన్సుల్లో, ఎమోషనల్ సీన్లలో, కామెడీ టైమింగ్లో తండైయాన్ మార్క్ చూపించి ఆకట్టుకున్నాడు.  ప్రకాష్ రాజ్ కూడ రామ్ తో కలిసి చేసిన హాస్యం బాగానే పండింది.  

మొదటి అర్థభాగం ఎంటెర్టైనింగా సాగినా ద్వితీయార్థం ఉన్నట్టుండి సీరియస్ గా మారిపోవడంతో కథనంలో వేగం లోపించింది.  హీరో హీరోయిన్ల నడుమ కూడ రొమాన్స్ పెద్దగా పండలేదు.  అన్ని ప్రేమ కథల్లాగే ఇది కూడ రొటీన్ గా ఉంటుంది తప్ప కొత్తదనం అనేదేమీ కనబడదు. 

నటీనటుల పనితీరు: 

హీరో రామ్ తన వంతుగా అన్ని విభాగాలకు సమన్యాయం చేశాడు.  అనుపమ పాత్రకు అంతగా స్కోప్ లేకపోయినా స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించింది.  ప్రకాష్ రాజ్ నటన బాగుంది.  ప్రణీత పాత్ర, అందులో ఆమె నటన కొత్తగా ఉన్నాయి. 

సాంకేతిక విభాగం :

కొత్తదనం లేని కథనే ఎంచుకున్న త్రినాథరావ్ ఫస్టాఫ్ ను ఆహ్లాదంగా నడిపినా సెకండాఫ్ కు వచ్చే సరికి కథనం నెమ్మదించి, సినిమా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఏమంత గొప్పగా లేదు.  విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ బాగుంది.  ఎడిటర్ సెకండాఫ్ రన్ టైమ్ కొంత ట్రిమ్ చేసుంటే బాగుండేది. 

పాజిటివ్ పాయింట్స్: 

ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ 

రామ్ నటన 

ప్రకాష్ రాజ్, ప్రణీతల కామెడీ 

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ ఎంటర్టైన్మెంట్ లోపించడం 

హీరో హీరోయిన్ల నడుమ అంత కెమిస్ట్రీ లేకపోవడం 

కథ కొత్తగా లేకపోవడం 

చివరగా : కొత్తదనం లేకపోయినా ఎంటర్టైన్మెంట్ ఉంది