లగడపాటి ఏపీ సర్వే వివరాలు ఇవే.. 

లగడపాటి ఏపీ సర్వే వివరాలు ఇవే.. 

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు హవా కొనసాగబోతుందని శనివారం విజయవాడలో తెలిపిన విషయం తెలిసిందే. ఈరోజు తిరుపతిలో తన సర్వే వివరాలను మీడియాకు తెలిపారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంటుందని తన సర్వేలో తేలిందని అన్నారు. టీడీపీకి 90 నుంచి 110, వైసీపీ 65 నుంచి 79, ఇతరులు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాయని తెలిపారు. పార్లమెంట్ స్ధానాల విషయానికి వస్తే.. టీడీపీ 13 నుంచి 17, వైసీపీ 8 నుంచి 12, ఇతరులు ఒక స్ధానం రావొచ్చని అన్నారు. అసెంబ్లీలో వివిధ పార్టీల ఓటింగ్ శాతం.. టీడీపీ 43 నుంచి 45 శాతం, వైసీపీ 40 నుంచి 42 శాతం, జనసేన 10 నుంచి 12 శాతంగా ఉంటుందని అన్నారు. పార్లమెంట్ లో టీడీపీ 43 నుంచి 45, వైసీపీ 40.5 నుంచి 42.5, జనసేన 10 నుంచి 12 శాతం ఓటింగ్ శాతం ఉంటుందని సర్వేలో తేలిందని లగడపాటి తెలిపారు.

ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఎన్నిక‌ల విశ్లేష‌ణ‌లో ప్రత్యేక స్థానం ఉంది. గ‌త ఏడాది తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఇచ్చిన అంచ‌నాలు పూర్తిగా విఫ‌ల‌మ‌వ్వటంతో ఆయ‌నకు కొంత ప్రాధాన్యత త‌గ్గినా..ఇప్పటికీ ల‌గ‌డ‌పాటి స‌ర్వేను ఆస‌క్తి చూసే వారి సంఖ్య త‌గ్గలేదు. ఇక‌, తాజాగా ఆయ‌న ఏపీలోటిడిపి తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చి చెప్పారు.