వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్ రిలీజ్‌ ‌ డేట్‌ ఫిక్స్‌

వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్ రిలీజ్‌ ‌ డేట్‌ ఫిక్స్‌

2019 లో హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో దిశపై లైంగిక దాడి..హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే. ఈ ఘటనని ఆధారంగా చేసుకుని  వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ  "దిశ ఎన్‌కౌంటర్‌ " అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేడ్‌ వచ్చింది. "దిశ ఎన్‌కౌంటర్‌ " సినిమా ట్రైలర్‌ రేపు విడుదల కానుంది. రేపు ఉదయం 9 గంటల 08 నిమిషాలకు  ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు. దిశ ఘటన జరగిన నవంబర్‌ 26నే సినిమా విడుదల చేస్తామని వర్మ తెలిపాడు. ఆనంద్‌ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.