పూరిని బుకింగ్స్ చూసుకోమంటున్న వర్మ

పూరిని బుకింగ్స్ చూసుకోమంటున్న వర్మ

పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' ఈ నెల 18న విడుదలకానుంది.  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది.  పాటలు, ట్రైలర్ బాగుండటంతో సినిమా చూడాలనే ఆసక్తి రేకెత్తింది.  దీంతో మొదటిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి.  సినిమా మీదున్న అంచనాల్ని గమయించిన పోపూరి గురువు రామ్ గోపాల్ వర్మ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గొప్పగా ఉన్నాయని, ఒక్కసారి వాటిని చూడమని పూరికి ట్విట్టర్ ద్వారా తెలిపారు.  అంతేకాదు బాక్సాఫీస్ బద్దలుకొట్టడానికి ఒక సినిమా సిద్ధంగా ఉందని కూడా అన్నారు.