తెరపైకి వర్మ బయోపిక్... ఆయన తీస్తారట... 

తెరపైకి వర్మ బయోపిక్... ఆయన తీస్తారట... 

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విషయంపై వార్తల్లో ఉంటూనే ఉంటాడు.  ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే వివాదంగా మారింది.  ఈ వివాదం ఇలా ఉండగానే.. రచయిత జొన్న విత్తులపై కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లోకి వచ్చాడు.  దీంతో జొన్న విత్తుల వర్మపై ఫైర్ అయ్యాడు.  

వర్మ తన కెరీర్ను తానే నాశనం చేసుకున్నాడని, వర్మ ఒక పప్పు అని, అంతర్జాతీయంగా వర్మ కంటే పెద్ద పప్పు మరొకరు ఉండరని, వర్మ పప్పు అనే సినిమా తీస్తానని జొన్నవిత్తుల పేర్కొన్నాడు.  ఇప్పటికైనా వర్మ మారి కెరీర్ను బాగుచేసుకొవాలని, వేరే వ్యక్తుల విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని జొన్నవిత్తుల పేర్కొన్నాడు.