మళ్ళీ వాయిదా పడ్డ ఆర్జీవీ 'మర్డర్' విచారణ !

మళ్ళీ వాయిదా పడ్డ ఆర్జీవీ 'మర్డర్' విచారణ !

మర్డర్ సినిమా విడుదలపై అమృత వేసిన పిటిషన్ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది SC, ST కోర్టు. మర్డర్ మూవీ విడుదలను నిలుపుదల చేయాలని ఇఫ్పటికే అమ్రుత ప్రైవేట్ పిటీషన్ వేసిన నేపధ్యంలో కోర్టు ఆ పిటిషన్ మీద విచారణ చేపట్టింది. ఈనెల 6న మొదట విచారణ జరగగా తదుపరి విచారణ 11కు వాయిదా వేసింది కోర్టు. తన క్లయింట్ రామ్ గోపాల్ వర్మ కు కరోనా వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే రెడీ చేసిన జవాబు పిటిషన్ పై రాంగోపాల్ వర్మ సంతకం చేయలేదని లాయర్ పేర్కొన్నాడు. 

అందుకే ఇవ్వలేకపోతున్నామని.. అందులో భాగంగానే గడువు ఇవ్వాలని 11న కోర్టును కొరడంతో ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు రాంగోపాల్ వర్మ, నట్టి కరుణ తరుపున అడ్వకేట్ అఫిడవిట్ ధాఖలు చేసారు. 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తనకు సినిమాపై సుధీర్ఘ అనుభవం ఉందని.... ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమా తీస్తున్నామని రాంగొపాల్ వర్మ పేర్కొన్నట్టున్న అఫిడవిట్ ని  అడ్వకేట్ కోర్టుకు దాఖలు చేసారు. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది కోర్టు..