30 ఏళ్ల నాటి వర్మ జ్ఞాపకం !

30 ఏళ్ల నాటి వర్మ జ్ఞాపకం !

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్లో 'శివ' సినిమా ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే.  ఈ సినిమా గురుంచి ఎప్పుడు మాట్లాడుకున్నా కొత్తగానే ఉంటుంది.  ఎలాంటి అనుభవంలేని తనను నమ్మి నాగేశ్వరరావుగారు నాగార్జునను తన చేతిలో పెట్టారని, నాగార్జున కూడా పూర్తి విశ్వాసంతో సినిమా చేశారని చెబుతుంటాడు వర్మ.  తన జీవితంలో ఎవరికైనా కృతజ్ఞత చెబితే అది ఈ సినిమా అవకాశం ఇచ్చిన నాగార్జునకే అంటాడు.  

శివ సినిమా వచ్చి ఇప్పటికి 29 ఏళ్ళు గడుస్తుండగా సినిమా మొదలై 30 ఏళ్ళు పూర్తైంది.  ఇదే ఫిబ్రవరి 17వ తేదీన నాగేశ్వరావుగారి చేతుల మీదుగా శివ సినిమా లాంచ్ అయింది.  ఈ మధువార జ్ఞాపకాన్ని వర్మ నెటిజన్లతో పంచుకున్నారు.